Header Banner

అమెరికాకు రుణపడి ఉంటాం.. ట్రంప్‌తో డీల్‌కూ సిద్ధమే! దద్దరిల్లిన వైట్‌హౌస్..

  Mon Mar 03, 2025 11:37        U S A

అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలపై ఉక్రెయిన్ అధినేత జెలన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అమెరికాతో సంబంధాలను కాపాడుకోగలనని, నిర్మాణాత్మక సంభాషణ కోసం అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళతానని చెప్పారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో శ్వేతసౌధంలో జరిగిన చర్చలు రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

ఆ తర్వాత ఆదివారం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు లండన్‌లో ఐరోపా దేశాధినేతలతో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. అనంతరం తాజా పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో సందేశం విడుదల చేశారు. ఐరోపా నుంచి తమకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైందన్న జెలెన్ స్కీ .. శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపై అంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యమన్నారు. యుఎస్ నుంచి తమకు అందుతున్న సాయంపై ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, వారికి కృతజ్ఞతలు తెలుపని రోజు లేదని అన్నారు. సుదీర్ఘ యుద్ధం కాదు.. మాకు శాంతి కావాలి. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని చెబుతున్నామని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #AmericaNews #USAPolice #USAPoliceNewdeathsentence #deathsentence #Nitrogengas #Nitrogengasdeathsentence